Diabetes: మధుమేహంతో భారత్‌పై ఆర్థిక భారం
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:19 AM
ఈ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాల్లో మధుమేహం ఒకటి..! భారత్‌లో కూడా ఈ సమస్య తీవ్రస్థాయిలోనే ఉంది.
ఈ జాబితాలో రెండో స్థానంలో భారత్
టాప్‌లో అమెరికా.. మూడో స్థానంలో చైనా
న్యూఢిల్లీ, జనవరి 12: ఈ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాల్లో మధుమేహం ఒకటి..! భారత్‌లో కూడా ఈ సమస్య తీవ్రస్థాయిలోనే ఉంది. మధుమేహ బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. దీనివల్ల భారత్‌పై 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతోందని అంతర్జాతీయంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. డయాబెటిస్ వల్ల అత్యధిక ఆర్థిక భారం ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో అమెరికా 16.5 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలవగా.. భారత్ రెండో స్థానంలో ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. 11 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారంతో చైనా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ ఎనాలసిస్, ఆస్ట్రియాలోని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ పరిశోధకులు.. 2020 నుంచి 2050 వరకు ప్రపంచవ్యాప్తంగా 204 దేశాలపై మధుమేహం వల్ల పడే ఆర్థిక ప్రభావాన్ని లెక్కించారు. వైద్యం కోసం పెద్దమొత్తంలో వెచ్చించాల్సి రావడం వల్ల వారి ఆదాయం తగ్గుతోందని ఈ అధ్యయనం వివరించింది.