Share News

23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:13 AM

ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్‌ల మధ్య హోలీ స్పెషల్‌ అప్‌ అండ్‌ డౌన్‌ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు

కాజీపేట(వరంగల్): ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్‌ల మధ్య హోలీ స్పెషల్‌ అప్‌ అండ్‌ డౌన్‌ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఫిబ్రవరి 23న, 28న, మార్చి 1 చర్లపల్లిలో సాయంత్రం 4. 50 నిమిషాలకు బయలుదేరి తరువాత రోజు సాయంత్రం 4. 50 నిమిషాలకు రక్సోల్‌కు చేరుకుంటుంది. తిరిగి ఫిబ్రవరి 26, మార్చి 3, 4 తేదీలలో మధ్యాహ్నం 3. 15 నిమిషాలకు బయలుదేరి తరువాత రోజు సాయంత్రం 7గంటల 20 నిమిషాలకు చర్లపల్లి(Cherlapalli)కి చేరుకుంటుంది.


train1.jpgఈ రైలుకు జనగామ, కాజీపేట జంక్షన్‌, పెద్దపల్లి(Peddapally), మంచిర్యాల, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్షా, చందాపోర్ట్‌, వాడ్సా, గోండియా, రాజ్‌నందగాన్‌, దర్గ్‌, రాయ్‌పూర్‌, బిలా్‌సపూర్‌, రాయ్‌గర్‌, జార్సుగూడ, బరుని, సమస్తిపూర్‌, దర్బంగా, కమ్‌టాల్‌, జానకిపూర్‌, సితామర్సి, బిరాగ్‌నియాన్‌ రైల్వే స్టేషన్‌లలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.


trains1.jpgఈ వార్తలు కూడా చదవండి:

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 17 , 2026 | 11:26 AM