Share News

Sabarimala Special Train: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. 15, 16 తేదీల్లో ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచంటే?

ABN , Publish Date - Jan 13 , 2026 | 10:52 AM

అయ్యప్ప స్వాముల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15, 16 తేదీల్లో కాకినాడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది..

Sabarimala Special Train: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. 15, 16 తేదీల్లో ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచంటే?
Sabarimala Special Train

అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఆ మణికంఠుడిని దర్శించుకుని పరవశించిపోతున్నారు. స్వామియే శరణం అయ్యప్ప.. అంటూ శబరిమల మార్మోగుతోంది. హరిహరసుతుని సన్నిధికి వెళ్లే అయ్యప్ప స్వాముల కోసం దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవడంతో రైళ్లన్నీ స్వాములతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ, చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలను సాగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా మకరవిళక్కు పండుగ నేపథ్యంలో శబరిమలకు స్వాముల తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు కొల్లం, తిరువనంతపురం సెంట్రల్ నుంచి కాకినాడ, చర్లపల్లికి చేరుకుంటాయి.


రైళ్ల సమయాలు ఇవే..

తిరువనంతపురం సెంట్రల్ నుంచి..

  • ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున 4:10 గంటలకు 06067 నెంబర్ గల ప్రత్యేక రైలు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

  • జనవరి 16న చర్లపల్లి నుంచి రాత్రి 9:45 గంటలకు 06068 ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. సరిగ్గా మూడో రోజు ఉదయం 8 గంటలకు తిరువనంతపురం సెంట్రల్‌కు చేరుకుంటుంది.

రైలు వెళ్లే మార్గం..

కొల్లం, చెంగన్నూర్, తిరువళ్ల, చంగనస్సేరి, కొట్టాయం, ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం టౌన్, ఆలువా, త్రిశూర్, పాలక్కాడ్, పొదనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట, కాట్పాడి, పెరంబూరు, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.


కొల్లం నుంచి...

  • ఈనెల 15న కొల్లం నుంచి తెల్లవారుజామున 3:30 గంటలకు 06065 నెంబర్‌ గల ప్రత్యేక రైలు కొల్లం నుంచి బయలుదేరి 16న మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

  • ఈనెల 16న సాయంత్రం 6 గంటలకు 06066 ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు ఎర్నాకుళానికి చేరుకుంటుంది. ఈ రైలు కొల్లం బదులుగా ఎర్నాకుళం వరకే నడుస్తుంది.

రైలు వెళ్లే మార్గం..

కాయంకుళం, చెంగన్నూర్, తిరువళ్ల, చంగనస్సేరి, కొట్టాయం, ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం టౌన్, ఆలువా, త్రిశూర్, పాలక్కాడ్, పొదనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట, కాట్పాడి, పెరంబూరు, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.


ఇవి కూడా చదవండి..

కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

మధుమేహంతో భారత్‌పై ఆర్థిక భారం

Read Latest National News and Telangana News

Updated Date - Jan 13 , 2026 | 11:33 AM