Share News

అనకాపల్లి ఉపమాక ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోం మంత్రి అనిత

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:05 PM

అనకాపల్లిలోని ఉపమాక ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని హోం మంత్రి అనిత సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనకాపల్లి ఉపమాక ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోం మంత్రి అనిత

అనకాపల్లి జిల్లా, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఉపమాక ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం ఉపమాక ఆలయాన్ని సందర్శించిన ఆమె.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో మంత్రికి అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనమిచ్చారు. స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు.


స్వామివారి వార్షిక కల్యాణ నేపథ్యంలో.. ఆలయ వద్ద అధికారులతో హోంమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలిచ్చిన ఆమె.. వారంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 27న ఉపమాక వేంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణం జరుగుతుందని తెలిపారు. ఆలయానికి రూ. 6 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. స్వామివారి వార్షిక కల్యాణం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టీడీపీ సంస్థాగత నిర్మాణంపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్..

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Read Latest AP News And Telugu News

టీడీపీ సంస్థాగత నిర్మాణంపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్..

Updated Date - Jan 26 , 2026 | 03:37 PM