ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 20 , 2026 | 06:47 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 20, 2026 20:52 IST
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ట్రంప్ టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు
సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి లేదన్న సుప్రీంకోర్టు
భారత్‌పై 18 శాతం సుంకాలు విధించిన ట్రంప్
-
Feb 20, 2026 20:36 IST
విజయవాడ: ఆయేషా మీరా కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు
27న ఆయేషా శరీర అవశేషాలకు అంత్యక్రియలు
ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేయాలన్న కోర్టు
అంత్యక్రియల ప్రక్రియ రికార్డ్ చేయాలన్న సీబీఐ కోర్టు
-
Feb 20, 2026 19:45 IST
మార్చి 14న ములుగులో కాంగ్రెస్ సభ
ఉపాధి హామీ పథకానికి పేరు మార్పును నిరసిస్తూ సభ
సభకు హాజరుకానున్న రాహుల్ గాంధీ
మార్చి 16న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
-
Feb 20, 2026 19:44 IST
గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశం
నోడల్ అధికారుల నియామకానికి ప్రభుత్వం ఆదేశం
డిటైల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్ సిద్ధం చేయాలని సూచనలు
జిల్లా షెడ్యూల్ ప్రకారం తనిఖీల నిర్వహణ
ఆకస్మిక సందర్శనలతో పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని నిర్ణయం
తనిఖీ నివేదికలు వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు
ప్రతి నెల 5వ తేదీలోపు నివేదిక సమర్పణ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
-
Feb 20, 2026 19:42 IST
భారతమండపంలో కాంగ్రెస్ చర్యను ఖండించిన కిషన్‌రెడ్డి
ప్రజలు కాంగ్రెస్‌ను అసహ్యించుకుంటున్నారు
కాంగ్రెస్ కార్యకర్తల తీరు సిగ్గుమాలిన చర్య
ప్రపంచ దేశాల మధ్య దేశ గౌరవాన్ని మంటగలిపారు
రాహుల్ విపక్షనేతగా ఉండడం దురదృష్టకరం
-
Feb 20, 2026 19:37 IST
టోల్‌గేట్లపై కేంద్రం కీలక నిర్ణయం
ఏప్రిల్ 1 నుంచి టోల్‌గేట్లలో నగదురహిత లావాదేవీలు
డిజిటల్ పేమెంట్లనే అనుమతించాలని కేంద్రం ఆదేశం
-
Feb 20, 2026 18:17 IST
ముంబై: పీఎంఎల్‌ఏ కోర్టులో రాజ్ కుంద్రాకు ఊరట
బిట్ కాయిన్ మోసం కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్
-
Feb 20, 2026 18:13 IST
ములుగు: కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీ బాంబు
జవాన్‌కు గాయాలు, హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలింపు
కర్రెగుట్టలో రోడ్డు నిర్మిస్తుండగా పేలిన IED
-
Feb 20, 2026 18:00 IST
హైదరాబాద్‌లో ‘వోల్టా జిమ్’ ప్రారంభం
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 59లో ‘వోల్టా జిమ్’ ఏర్పాటు
జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
ఈ జిమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ
-
Feb 20, 2026 17:58 IST
కర్రెగుట్టలలో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలి
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్
భద్రతా దళాల కూంబింగ్‌తో భయాందోళన పరిస్థితులు: సీపీఐ(ఎంఎల్)
లొంగిపోవడానికి వస్తున్న వారిని కూడా చంపేస్తున్నారు: సీపీఐ(ఎంఎల్)

-
Feb 20, 2026 17:52 IST
రంగారెడ్డి జిల్లా: చేవెళ్లలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
చేవెళ్లలోని ఆలయం పుష్కరిణిలో మృతదేహం లభ్యం
కర్రతో బాది హత్య చేసినట్లు భావిస్తున్న పోలీసులు
-
Feb 20, 2026 17:48 IST
మెదక్: కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గేటు దగ్గర రోడ్డుప్రమాదం
రెండు కార్లు ఢీకొని పక్కనే వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం
ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులకు విరిగిన కాళ్లు, పరిస్థితి విషమం
రెండు కార్లలో ఉన్న 11 మందికి గాయాలు, నర్సాపూర్ ఆసుపత్రికి తరలింపు
-
Feb 20, 2026 17:46 IST
కాకినాడ జిల్లా: అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రమాదం
బస్సు ఢీకొని పురోహితుడు మృతి
అన్నవరం దేవస్థానం వ్రత పురోహితుడు రఘునాథ్ శర్మగా(19) గుర్తింపు
-
Feb 20, 2026 17:42 IST
అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక అధ్యయనానికి ఏకసభ్య కమిటీ ఏర్పాటు
కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్
సిట్ నివేదికను అధ్యయనం చేయనున్న కమిషనర్
45 రోజుల్లోగా నివేదికను సమర్పించనున్న ఏకసభ్య కమిటీ
తదుపరి చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్న కమిటీ
-
Feb 20, 2026 17:31 IST
ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసనపై బీజేపీ ఆగ్రహం
టాప్‌లెస్.. బ్రెయిన్ లెస్.. షేమ్ లెస్ కాంగ్రెస్ అంటూ బీజేపీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ చర్యను ఖండిస్తున్నాం: కేంద్రమంత్రి రాజ్‌నాథ్
కాంగ్రెస్‌కు దేశం కంటే రాజకీయాలు ముఖ్యం: చౌహాన్
కాంగ్రెస్ నేతలు దేశద్రోహులు: ఎంపీ సంబిత్ పాత్ర
దేశ ప్రతిష్ఠను కాంగ్రెస్ దెబ్బతీస్తోంది: సీఎం యోగి
-
Feb 20, 2026 17:30 IST
అమరావతిలో 7 ఐకానిక్ భవనాలు నిర్మాణం: మంత్రి నారాయణ
2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి
21 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం
B+G+7 అంతస్తుల్లో నూతన హైకోర్టు భవనం నిర్మాణం
2,4,6 ఫ్లోర్‌లతో 52 కోర్టు హాల్స్ ఉండనున్నాయి
8వ ఫ్లోర్‌లో సీజే కోర్టు హాలు
అమరావతిలో రోడ్లు నిర్మాణ పనులు వేగవంతం
-
Feb 20, 2026 16:52 IST
అమరావతి: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు
ఈ నెల 26న విచారణకు రావాలంటూ నోటీసులు
కల్యాణ్‌చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌కు నోటీసులు
ఈ నెల 25న విచారణకు రావాలని జయమంగళం వెంకట రమణకు నోటీసులు
-
Feb 20, 2026 16:36 IST
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
294 పాయింట్ల లాభంతో 82,793 వద్ద ముగిసిన సెన్సెక్స్
111 పాయింట్ల లాభంతో 25,565 వద్ద ముగిసిన నిఫ్టీ
-
Feb 20, 2026 16:30 IST
కాకినాడ: గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ నాగేష్ బాబు అరెస్ట్
విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన ఎంపీటీసీ చెల్లూరి నాగేష్ బాబు అరెస్ట్
కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పరారీలో ఉన్న నాగేష్ బాబు
220కేజీల గంజాయి కారులో తరలిస్తుండగా గతేడాది సెప్టెంబర్‌లో పట్టుకున్న పోలీసులు
ఏ 8 గా ఉన్న ఎంపీటీసీ, అప్పటినుంచి పరారీలోనే
ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు
నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ బొత్సా సత్యనారాయణ మేనల్లుడికి అనుచరుడిగా గుర్తింపు
-
Feb 20, 2026 16:28 IST
గోదావరిలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ విఫలం: హరీశ్‌రావు
ఏపీ నల్లమలసాగర్ కడుతుంటే రేవంత్ మౌనంగా ఉన్నారు
కృష్ణాలోనూ మన నీటి వాటాను వాడుకోలేకపోతున్నారు
ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే అడ్డుకోలేకపోతున్నారు
ఎప్పటికప్పుడు రైతుబంధు అంటూ రైతులను మోసం చేస్తున్నారు
-
Feb 20, 2026 16:07 IST
నెల్లూరు జిల్లాలో పోలీసుల డ్రోన్ ఆపరేషన్లు
నెల్లూరు శివార్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో తనిఖీలు
మద్యపానం, గంజాయి వినియోగం, పేకాట స్థావరాలపై ఫోకస్
-
Feb 20, 2026 16:06 IST
అమరావతి: కూటమి సభ్యులకు వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్
చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లినట్లు నిరూపిస్తే ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తా: మాధవరావు
వీడియో బయటపెట్టి ఎమ్మెల్సీ రాజీనామాకు డిమాండ్ చేసిన మంత్రి సంధ్యారాణి
-
Feb 20, 2026 16:05 IST
దేవుడి పట్ల భక్తి-భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు: మంత్రి సంధ్యారాణి
ప్రజలకు జగన్, వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పి తీరాలి: సంధ్యారాణి
వేంకటేశ్వరస్వామి ఫొటోలను ఫ్లకార్డులు వాడటం దుర్మార్గం: మంత్రి
-
Feb 20, 2026 15:22 IST
ఎల్బీనగర్‌లోని చెట్నీస్ హోటల్‌లో పేలుడు
ఇడ్లి స్టీమర్ ఒక్కసారిగా పేలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు
పేలుడు శబ్దానికి పరుగులు పెట్టిన కస్టమర్స్
గాయలైన వారిని స్థానిక హాస్పిటల్‌కి తరలింపు
పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం
ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బీనగర్ పోలీసులు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Feb 20, 2026 14:53 IST
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం

సీఎం స్టాలిన్‌ను కలిసిన మాజీ సీఎం పన్నీర్‌సెల్వం
డీఎంకే ఐదేళ్ల పాలనను పొగిడిన పన్నీర్‌సెల్వం
డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉంది: పన్నీర్‌సెల్వం
వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తోంది: పన్నీర్‌సెల్వం
-
Feb 20, 2026 14:00 IST
ఢిల్లీ: Ai సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
Ai శకం ఇప్పటికే మొదలైంది: సీఎం రేవంత్
గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది: సీఎం రేవంత్
ఇప్పుడు సాఫ్ట్‌వేర్ విప్లవం నడుస్తోంది: సీఎం రేవంత్
భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారు: సీఎం రేవంత్
మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు: సీఎం రేవంత్
-
Feb 20, 2026 13:53 IST
హైదరాబాద్: వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టు విచారణ
హాజరైన ఎంవీ అవినాష్‌రెడ్డి సహా మిగిలిన నిందితులు
నిందితులకు 13 లక్షల ఫైల్స్ ఉన్న హార్డ్‌డిస్క్‌లను అందజేసిన CBI
సీబీఐ ఇచ్చిన హార్డ్‌డిస్క్‌ల్లో కొన్ని ఫైల్స్ ఓపెన్ కావట్లేదని కోర్టుకు తెలిపిన నిందితుల తరఫు న్యాయవాదులు
సమాచారాన్ని ఇండెక్స్ రూపంలో ఇవ్వాలని కోరిన లాయర్లు
తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా
-
Feb 20, 2026 13:41 IST
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ
కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు సీరియస్
మీరు కాదంటే చెప్పండి.. సీబీఐతో విచారణ జరిపిస్తాం: సుప్రీం
నవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తిచేయాలి: సుప్రీంకోర్టు
-
Feb 20, 2026 12:13 IST
మరోసారి బాంబు బెదిరింపు..
నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
కోర్టులో తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్
-
Feb 20, 2026 11:48 IST
హైదరాబాద్ అమీర్‌పేటలో అగ్నిప్రమాదం
మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో చెలరేగిన మంటలు
నాలుగో అంతస్తులోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చిక్కుకున్న విద్యార్థులు
భవనం బాల్కనీ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది
-
Feb 20, 2026 11:01 IST
వేంకటేశ్వరస్వామి ఫొటోలను టేబుళ్లపై పడేసి వెళ్లిపోయిన వైసీపీ సభ్యులు
దేవదేవుడికి అపచారం చేస్తున్నారంటూ కూటమి సభ్యుల ఆందోళన
వైసీపీ సభ్యుల తీరుపై మండలి చైర్మన్‌కు కూటమి నేతల ఫిర్యాదు
మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన మంత్రి లోకేష్ సహా కూటమి సభ్యులు
వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కూటమి పార్టీల డిమాండ్
-
Feb 20, 2026 11:00 IST
శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై కూటమి సభ్యుల ఆగ్రహం
దేవుడి ఫొటోలు పట్టుకుని చెప్పులు, షూలతో సభలోకి రావడంపై ఫైర్
హిందూ సంప్రదాయాలపై వైసీపీకి గౌరవం లేదని మండిపాటు
వేంకటేశ్వరస్వామిని ప్రతిరోజూ సభలో అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం
సభలో ప్రతిరోజూ గోవిందా.. గోవిందా.. నినాదాలపై సీరియస్
-
Feb 20, 2026 11:00 IST
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్‌పై నా అన్వేషణ అన్వేష్ మరో వీడియో
ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఎంత.. పోతే ఎంత అంటూ అన్వేష్ కామెంట్స్
యూట్యూబ్ ఖాతా నుంచి నెలకు రూ.8 లక్షలు వస్తాయి: అన్వేష్
ఇన్‌స్టాగ్రామ్ పోతే బాధపడతాననుకున్నారా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు
-
Feb 20, 2026 10:59 IST
హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీలు దేవుడి సొమ్ము దోచుకున్నాయి: బొత్స
ఈ దోపిడీపై చర్చ జరగాల్సిందే: బొత్స
సభలో చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?: బొత్స
హెరిటేజ్‌పై మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు?: బొత్స
-
Feb 20, 2026 10:50 IST
జగిత్యాల: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అస్వస్థత
హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి జీవన్‌రెడ్డి తరలింపు
జీవన్‌రెడ్డికి ఫుడ్‌పాయిజన్ అయినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు
-
Feb 20, 2026 10:49 IST
బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
రూ.10 కోట్లు ఇవ్వాలంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ డిమాండ్
రణ్‌వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్‌నకు అమెరికన్ నెంబర్ నుంచి వాయిస్ నోట్
రణ్‌వీర్ సింగ్ నివాసం దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు
-
Feb 20, 2026 10:46 IST
ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
2027 జూన్ 6 నుంచి గోదావరి పుష్కరాలు: మంత్రి నిమ్మల
భక్తుల రద్దీ దృష్ట్యా స్నానఘట్టాలు పెంపు: మంత్రి నిమ్మల
నది కాలుష్యం కాకుండా జాగ్రత్తలు: మంత్రి నిమ్మల
-
Feb 20, 2026 10:39 IST
హిందువులను వైసీపీ రెచ్చగొడుతోంది: మంత్రి పయ్యావుల
చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు: పయ్యావుల
వేంకటేశ్వరస్వామి ఫొటోలను సభకు తేవడంపై అధికారపక్షం అభ్యంతరం
ఆందోళనల మధ్య శాసనమండలి 10 నిమిషాలపాటు వాయిదా
-
Feb 20, 2026 10:33 IST
ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళం
అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం
ఇందాపూర్ డెయిరీపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ
గోవిందా.. గోవిందా.. అంటూ మండలిలో వైసీపీ సభ్యుల నినాదాలు
వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల ఫైర్
-
Feb 20, 2026 10:32 IST
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
150 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
-
Feb 20, 2026 10:32 IST
ఆదిలాబాద్: ఖానాపూర్, క్యాతన్‌పల్లిలో హైడ్రామా
మున్సిపాలిటీల చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎన్నికపై ఉత్కంఠ
ఎన్నికల సంఘం నిర్ణయానికే వదిలేసిన జిల్లా కలెక్టర్లు
ఎన్నిక కోసం తదుపరి తేదీ ఖరారు చేయనున్న ఈసీ
బలం పెంచుకునే దిశగా అధికార, విపక్ష పార్టీల ఎత్తులు
-
Feb 20, 2026 10:31 IST
విశాఖ: ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో అయాన్స్ కార్యక్రమం
వివిధ ప్రపంచ దేశాల నేవీ చీఫ్‌లతో, 9వ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్ నిర్వహణ
33 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు
-
Feb 20, 2026 10:30 IST
రాజస్థాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
కాసేపట్లో Ai సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులతో..
సమావేశం కానున్న ఏపీ సీఎం చంద్రబాబు
-
Feb 20, 2026 09:22 IST
అమరావతి: ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ, ఆమోదం
ఏపీ శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగంపై నేడు పయ్యావుల సమాధానం
అసెంబ్లీ ఆమోదించిన 7 బిల్లులను మండలిలో పెట్టనున్న ప్రభుత్వం
-
Feb 20, 2026 08:05 IST
పెద్దపల్లి: గోదావరిఖనిలో కత్తిపోట్ల కలకలం
సుమతి అనే మహిళ కుటుంబంపై కత్తితో దాడి చేసిన వ్యక్తి
దాడిలో సుమతి, కొమురమ్మ, ప్రణయ్‌కు గాయాలు
ప్రణయ్ పరిస్థితి విషమం, కరీంనగర్ ఆస్పత్రికి తరలింపు
దుకాణంలో సిగరెట్లు కాలుస్తున్నారనే నెపంతో దాడి
సుమతికి నిందితుడు కొడుకు వరస అవుతాడని సమాచారం
-
Feb 20, 2026 07:16 IST
నేడు ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ, ఆమోదం
-
Feb 20, 2026 06:51 IST
యాదగిరిగుట్టలో మూడోరోజు వార్షిక బ్రహ్మోత్సవాలు
రాత్రి 7 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామికి శేషవాహన సేవ
-
Feb 20, 2026 06:51 IST
ఆండ్రూ అరెస్ట్ విచారకరం: డొనాల్డ్ ట్రంప్
బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్టుపై స్పందించిన ట్రంప్
ఆండ్రూ అరెస్ట్ సిగ్గుచేటు, విచారకరం: డొనాల్డ్ ట్రంప్
-
Feb 20, 2026 06:50 IST
టీ20 వరల్డ్ కప్: రాత్రి 7 నుంచి ఆస్ట్రేలియా Vs ఒమన్
నేటితో ముగియనున్న గ్రూప్ దశ మ్యాచ్‌లు
రేపటి నుంచి ప్రారంభంకానున్న సూపర్-8 మ్యాచ్‌లు
-
Feb 20, 2026 06:48 IST
నేడు ఏపీ సీఎస్ అధ్యక్షతన కీలక సమావేశం
జనాభా లెక్కల సేకరణ-2027పై రాష్ట్రస్థాయి భేటీ
ఉ.10:30 నుంచి సా.4 గంటల వరకూ సమావేశం
జనాభా లెక్కల సేకరణ-2027కు సన్నద్ధతపై చర్చ
-
Feb 20, 2026 06:47 IST
నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
Ai సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిథులతో..
సమావేశం కానున్న ఏపీ సీఎం చంద్రబాబు
IBMతో ఒప్పందం చేసుకోనున్న సీఎం చంద్రబాబు
10 లక్షల మందికి నైపుణ్యం కల్పించేలా ఒప్పందం
క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం ఏర్పాటుకు..
యూనిసిస్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్న చంద్రబాబు
సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు