Share News

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న 200 మంది విదేశీయులు..

ABN , Publish Date - Feb 20 , 2026 | 08:28 PM

శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను 200 మంది రష్యన్, జర్మన్ దేశస్తులు దర్శించుకున్నారు. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠానికి విచ్చేసిన వీరిని.. శక్తిపీఠం పీఠాధిపతి మూర్తి ఆహ్వానించారు..

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న 200 మంది విదేశీయులు..
Srikalahasti Temple

తిరుపతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను (Srikalahasti Temple) 200 మంది రష్యన్, జర్మన్ దేశస్తులు దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన విదేశీయులు.. శుక్రవారం స్వామిని దర్శించుకున్నారు. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠానికి విచ్చేసిన వీరిని.. శక్తిపీఠం పీఠాధిపతి మూర్తి ఆహ్వానించారు. విదేశీయులకు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.


దర్శన అనంతరం ఆలయంలోని గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులుతో ప్రత్యేక ఆశీర్వాదం ఇప్పించి దేవతల తీర్థప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర, రాహు కేతు, సర్ప దోష పూజల ప్రత్యేకత గురించి వారికి ఆలయ అధికారులు వివరించారు. అనంతరం ఆలయ ఆవరణలో విదేశీయులు ధ్యానం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 08:35 PM