Share News

అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చర్యలు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:49 PM

ఏపీలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించారు.

అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చర్యలు: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఏపీలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ పెట్టారాయన. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించారు.


అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తోందని పేర్కొన్నారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. అధిక ధరలకు విక్రయించే మద్యం వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 01:57 PM