నెల్లూరులో రాకెట్ పరిశోధనా కేంద్రం.. ప్రభుత్వంతో కీలక ఒప్పందం
ABN , Publish Date - Feb 12 , 2026 | 04:05 PM
నెల్లూరులో వెయ్యి కోట్లతో రాకెట్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ కీలక ఒప్పంద కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌తో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
నెల్లూరు, ఫిబ్రవరి 12: దుత్తలూరు మండలంలో రాకెట్ పరిశోధనా కేంద్రం (స్పేస్) ఏర్పాటు చేయడానికి ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో (AP Govt) కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాకెట్, స్పేస్ సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన అభివృద్ధి జరగనుంది. గతంలో రాకెట్ పరిశోధన కేంద్రం స్థాపనకు రాచవారిపల్లి, బ్రహ్మశ్వరం రెవెన్యూ పరిధిలోని భూములను నెల్లూరు కలెక్టర్ హిమాన్సు శుక్లా పరిశీలించారు.
ఈ రాకెట్ పరిశోధన కేంద్రం స్థాపనతో ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరగనున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభించే అవకాశం ఉంది. ఉదయగిరి నియోజకవర్గం కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందనుంది. పరిశ్రమల స్థాపన ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతం లభించనుంది.
ఇవి కూడా చదవండి...
చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రతిభపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే
ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..
Read Latest AP News And Telugu News