కాలుష్య రహిత నగరంగా నెల్లూరును తీర్చిదిద్దుతాం: మంత్రి నారాయణ
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:25 PM
నెల్లూరును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు రూ.11 కోట్ల 75 లక్షలతో రోడ్ల పనులు చేపట్టామని మంత్రి నారాయణ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.
నెల్లూరు, జనవరి 31: జిల్లా అభివృద్ధికి మరో అడుగు పడింది. నెల్లూరులో ఎండ్ టు ఎండ్ రోడ్ల పనులకు రూ.11 కోట్ల 75 లక్షలు మంజూరైనట్లు మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. రూ.1.07 కోట్లతో చేపట్టిన తొలి విడత రోడ్డు పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం రామిరెడ్డి కాలువ ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం రూ.11 కోట్ల 75 లక్షలతో ఎండ్ టూ ఎండ్ రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. 96 ప్రాంతాల్లో ఈ పనులు జరుగుతున్నాయని.. మార్చి ఆఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు.
నగరంలో శుభ్రత పెంపొందించేందుకు 28 స్వీపింగ్ మిషన్లను కేటాయించామని, రూ.20 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి నారాయణ వివరించారు. ముంపు ముప్పు నుంచి నెల్లూరును తప్పించేందుకు మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నామని.. నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా రామిరెడ్డి కాలువ ఆధునికీరణ పనులను చేస్తున్నామని.. ఎవరికైనా నష్టం జరిగితే వెంటనే ప్రత్యామ్నాయం చూపిస్తామని తెలిపారు. అయితే కొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని, కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీ ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి పయ్యావుల కేశవ్
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Read Latest AP News And Telugu News