Share News

అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు.. ఆ తర్వాత ఏమైందంటే..

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:50 PM

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడు అటవీ ప్రాంతంలో ఓ వృద్ధురాలు తప్పిపోయింది. దారి తప్పిపోయిన ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు.. ఆ తర్వాత ఏమైందంటే..
Elderly Woman Rescue

నెల్లూరు జిల్లా: వరికుంటపాడు మండలం కనియంపాడు అటవీ ప్రాంతంలో వృద్ధురాలు తప్పిపోవడం తీవ్ర కలకలం రేపింది. గడ్డి ఊడలు సేకరించటానికి వెళ్లిన మామిడి నాగమ్మ (65) దారి తప్పి కనిపించకుండా పోయింది. చీకటి పడుతున్నా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.


ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి నాగమ్మను సురక్షితంగా గుర్తించారు. ఆమెకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన పోలీసులకు గ్రామస్తులు, నాగమ్మ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..

రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు

Updated Date - Feb 05 , 2026 | 06:54 PM