జగన్ హయాంలో పర్యాటక రంగం నష్టపోయింది: మంత్రి కందుల దుర్గేశ్
ABN , Publish Date - Feb 18 , 2026 | 09:49 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.
విజయవాడ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు. 2019 నుంచి 2024 వరకు జగన్ హయాంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇవాళ(బుధవారం) విజయవాడలో జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యాటకశాఖ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా తెలిసేలాగా పని చేస్తున్నామని తెలిపారు. ఈ 18 నెలల కాలంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 1.28,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం మొత్తం ఈవెంట్స్ చేస్తున్నామని, మన బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ రంగంలో పెట్టుబడులు పెరగడానికి కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏపీ ముందుకు వెళుతోందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత
మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..
Read Latest Telangana News And AP News And Telugu News