హిందూపురం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు: మన్నవ మోహనకృష్ణ
ABN , Publish Date - Feb 19 , 2026 | 10:48 PM
హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మోహన కృష్ణ కొనియాడారు.
హిందూపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Hindupuram MLA Balakrishna) నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ (Mannava Mohanakrishna) వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మోహన కృష్ణ కొనియాడారు. హిందూపురంలో ఏపీటీఎస్ సౌజన్యంతో 6 ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

హిందూపురంలో ఇవాళ(గురువారం) ముద్దిరెడ్డిపల్లి, వ్యవసాయ మార్కెట్‌లోని ఆర్వో వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మన్నవ మోహనకృష్ణ ప్రారంభించారు. గతంలో కూడా హిందూపురం నియోజకవర్గంలో పలు చోట్ల ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు, సేవా కార్యక్రమాలను మన్నవ మోహనకృష్ణ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం ప్రజల తాగునీటి కష్టాలను పరిష్కరిస్తూ అపర భగీరధుడిగా బాలకృష్ణ నిలుస్తున్నారని పేర్కొన్నారు.

హిందూపురం నియోజకవర్గాన్ని బాలకృష్ణ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. అందుకే బాలకృష్ణకి హిందూపురంలో ప్రతి ఎన్నికకు మెజారిటీ పెరుగుతోందని మన్నవ మోహన కృష్ణ పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంలో చూపిన చొరవకు, అలాగే గతంలో హిందూపురం అభివృద్ధి కోసం అందించిన సహాయానికి మన్నవ మోహన కృష్ణని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Read Latest Telangana News And AP News And Telugu News