Share News

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు..

ABN , Publish Date - Feb 19 , 2026 | 06:59 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లకు ఖరారుకు సంబంధించి.. డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు..
Andhra Pradesh Government

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లకు ఖరారుకు సంబంధించి.. డెడికేటెడ్ కమిషన్‌ను నియమిస్తూ.. సీనియర్ ఐఏఎస్ మాజీ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ నిర్ధారించేందుకు బీసీ జనాభా లెక్క తేల్చాలని కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. బీసీ జనాభా లెక్కలను తేల్చేందుకు.. సంబంధిత సంస్థలు, ముఖ్యమైన వ్యక్తులు, ఇతర సంఘాల నుంచి వివరాలు సేకరించాలని ప్రభుత్వం పేర్కొంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 07:18 PM