కేరళ వాసుల వ్యక్తిత్వానికి దేశమంతా ఫిదా

ABN, Publish Date - Feb 19 , 2026 | 07:06 AM

చదువంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు.. మానవత్వం, సమయస్ఫూర్తి అంతకుమించి సమాజం పట్ల బాధ్యత. ఇవన్నీ ఉంటేనే చదువులకు విలువ. ఈ విషయంలో తమదే అగ్రస్థానం అని కేరళ వాసులు మరోసారి నిరూపించుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కేరళ వాసులు మరోసారి మానవత్వపు విలువను చాటిచెప్పారు. ఒట్టపాలెంలో రోడ్డుపై వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి, 10 సెకండ్లలో బస్ డోర్లు తెరిచి ప్రయాణికులను బయటకు దింపేశారు. అగ్నిమాపక పరికరం(ఫైర్ ఎక్స్‌టింగ్విషర్)తో మంటలు ఆర్పేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దూరంగా నిలబడి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి లేదా ఇతర అధికారులకు ఫోన్ చేసి వాళ్లు వచ్చే వరకూ ఎదురు చూస్తుంటారు. కానీ, కేరళవాసులు సెకండ్ల వ్యవధిలోనే సమయస్ఫూర్తితో ఎంతో ధైర్యం చేసి పలువురిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.


ఈ వీడియోలు చూడండి:

దుస్తులను లాగడం అత్యాచార యత్నమే..సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఏఐ సమ్మిట్ లో పరువు తీసుకున్న గల్గొటియాస్ యూనివర్సిటీ

Updated at - Feb 19 , 2026 | 07:49 AM