కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 08:36 AM
నెలవంక బుధవారం కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మక్కా మసీదులో తర్వా నమాజ్ ప్రారంభమైంది. పాతబస్తీ ముస్లింలు మొదటి పది రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవడానికి ప్రాధాన్యం ఇస్తారు.
చార్మినార్, ఫిబ్రవరి 19 : నెలవంక బుధవారం కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మక్కా మసీదులో తరావీహ్ నమాజ్ ప్రారంభమైంది. పాతబస్తీ ముస్లింలు మొదటి పది రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవడానికి ప్రాధాన్యం ఇస్తారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం తరపున మసీదుకు వచ్చే భక్తుల కోసం షెడ్ ఏర్పాటు చేస్తున్నారు. మసీదులో కొత్త జానిమాజ్లు పరిచారు. ఇఫ్తార్ సమయంలో తాగు నీటి సౌకర్యం కల్పించనున్నారు. గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. రంజాన్ మాసం వచ్చిందంటే పాతబస్తీలో ప్రజలు ఇళ్లను సుందరంగా అలంకరించుకుంటారు. ధనవంతులు ఇళ్లకు రంగులు వేసుకుంటారు. రంజాన్‌కు ముందు కొత్త వస్తువులు కొనుగోలు చేసి పాత వస్తువులు తీసేస్తారు.
హలీమ్ ఏర్పాట్లు
రంజాన్ మాసం ప్రారంభం కానుండడంతో పిస్తా హౌస్ యజమాని మాజిద్ తన హోటల్‌పై కౌంట్ డౌన్ బోర్డును ఏర్పాటు చేశారు. అటు వైపు వెళ్లే వారు బోర్డు చూసి హలీం తినే సమయం వచ్చిందని సంబరపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రయాణికులకు తీవ్రగాయాలు
For More TG News And Telugu News