శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

ABN, Publish Date - Feb 19 , 2026 | 08:15 AM

యాదాద్రిలో కొలువుదీరిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గర్భాలయంలో స్వయంభువులకు ప్రత్యేక ఆరాధాన నిర్వహించారు. ప్రధాన పూజారి కాండూరి వెంకటాచార్య నేతృత్వంలో యాజ్ఞికులు సురేంద్రాచార్య విష్వక్సేన ఆరాధన జరిపారు. పుట్టమన్ను, నవధాన్యాలతో.. రాత్రివేళ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 1/8

యాదాద్రిలో కొలువుదీరిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గర్భాలయంలో స్వయంభువులకు ప్రత్యేక ఆరాధాన నిర్వహించారు. ప్రధాన పూజారి కాండూరి వెంకటాచార్య నేతృత్వంలో యాజ్ఞికులు సురేంద్రాచార్య విష్వక్సేన ఆరాధన జరిపారు. పుట్టమన్ను, నవధాన్యాలతో.. రాత్రివేళ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 2/8

ఈ రోజు అంటే గురువారం ఉదయం ధ్వజారోహణం, దేవతలకు ఆహ్వానపర్వాలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జేసీ భాస్కరరావు , ఆలయ ఈవో భవానీ శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 18న స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధన, సాయంత్రం మత్స్యగ్రహణం, అంకురార్పణ.. ఫిబ్రవరి 19న ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం భేరి పూజ.

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 3/8

ఫిబ్రవరి 20న ఉదయం మత్స్యావతార అలంకారం, సాయంత్రం శేష వాహన సేవ వేదపారాయణములు, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ.. ఫిబ్రవరి 21న ఉదయం వటపత్ర శాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ..

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 4/8

ఫిబ్రవరి22న శ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్న వాహన సేవ.. ఫిబ్రవరి 23న ఉదయం గోవర్ధన గిరిధారి, సాయంత్రం సింహ వాహన సేవ..

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 5/8

ఫిబ్రవరి 24న జగన్మోహినీ అలంకార సేవ, అశ్వ వాహనంపై రాత్రి ఎదుర్కోలు వేడుక.. ఫిబ్రవరి 25న రాత్రి స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం..

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 6/8

ఫిబ్రవరి 26న రాత్రి 8 గంటలకు దివ్య విమాన రథోత్సవం.. ఫిబ్రవరి 27న స్వామి వారి చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు.

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 7/8

ఫిబ్రవరి 28న గర్భాలయంలో మూలవర్యులకు నిర్వహించే సహస్ర పట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 8/8

స్వామి వారి వార్షిక బ్రహోత్సవాలకు భారీగా భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated at - Feb 19 , 2026 | 08:22 AM