పెరుగులో ఊరే నీటిని తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..?
పాలు తోడి పెట్టిన తర్వాత పెరుగు గట్టిగా తయారవుతోంది. ఒకటి రెండు రోజుల తర్వాత పెరుగులో పసుపు నీరు ఊరుతోంది.
సాధారణంగా ఈ నీటిని అందరూ పారబోస్తారు. కానీ ఈ నీటిలో శరీరాన్ని రక్షించే పోషకాలు అనేకం ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఈ నీటిలో ప్రోటీన్లు, పొటాషియం, కాల్షియం, జింగ్ తదితర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగు ఆరోగ్యాన్ని, మలబద్ధకాన్ని, అజీర్తిని తగ్గించడానికి సహాయపడుతుంది.
శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా..హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ఇది అద్భుతంగా పని చేస్తోంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ నీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపించడం ద్వారా ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఈ నీటిలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి.
చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగుపై నీరు పాడైపోయిందంటూ పారబోస్తారు. అలా పారవేయకుండా వాటిని తాగాలి. ఇది అత్యంత పోషకాల గని అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
రాత్రి భోజనం త్వరగా చేస్తే.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..
పీనట్ బటర్.. మీ బరువును, షుగర్‌ను తగ్గిస్తుంది..
రాగి జావతో మెంతులు కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..
యువ ఉద్యోగులను వేధిస్తున్న 5 ప్రధాన ఆరోగ్య సమస్యలు