సింపుల్ చిట్కా.. షుగర్‌ను నియంత్రించే దివ్యౌషధం..
రాగి జావలో రాత్రంతా నానబెట్టిన మెంతులను కలిపి ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో మెంతులు సహాయపడతాయి. రాగులు నెమ్మదిగా జీర్ణమై శక్తిని విడుదల చేస్తాయి.
ఇది ఆకలిని నియంత్రించి.. కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనిలో కరిగే ఫైబర్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రాగులలో పాలు కంటే 3 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచి.. ఆస్టియోపోరోసిస్ తదితర సమస్యలను నివారిస్తుంది.
మెంతులు శరీరానికి చలువ చేస్తాయి. వేసవిలో రాగి జావతో కలిపి వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది.
బాలింతలలో పాలు పడటానికి ఇది సహజ సిద్ధమైన ఔషధంగా పని చేస్తుంది.
ఒక టీ స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం రాగి జావ కాచేటప్పుడు వాటిని అందులో వేసి.. మరిగించి తీసుకోవడం మంచిది.
దీనిని ప్రతిరోజూ తీసుకుంటే మంచిది. కానీ అతిగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
యువ ఉద్యోగులను వేధిస్తున్న 5 ప్రధాన ఆరోగ్య సమస్యలు
కొలస్ట్రాల్, బ్లడ్ షుగర్ సమస్యలు.. కరివేపాకుతో చెక్ పెట్టండి..
సన్‌స్క్రీన్ వాడితే చర్మానికి కలిగే లాభాలు ఇవే..
నోటి దుర్వాసన పోగొట్టే ఫుడ్