జనగణనకు వేళాయే!
ABN , Publish Date - Feb 27 , 2026 | 01:02 AM
దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల్లో భాగంగా జిల్లాలో అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల్లో భాగంగా జిల్లాలో అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలను ఆరంభించనున్నారు. ముందుగా ఇళ్ల సంఖ్య నమోదు చేసిన తర్వాత ఒక్కో ఇంటిలో నివాసం ఉంటున్న జనాభాను లెక్కించను న్నారు. దీనికి సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయులను నియ మించనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్ల ఎంపిక పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 2011లో 16వ జనగణన చేపట్టారు. ప్రతీ పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. 2011 తర్వాత 2021లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా, అదే సమయంలో కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ కారణంగా జనాభా లెక్కలు చేపట్టలేదు. కరోనా 2022లో ముగిసినప్పటికీ, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఆ తర్వాత 2024 జూన్‌లో పార్ల మెంట్ ఎన్నికలు జరిగాయి. త్వరితగతిన జనాభా లెక్క లు చేపట్టాలని ఆయా పార్టీలు, వర్గాల నుంచి డిమాం డ్లు వచ్చాయి. దీంతో ఎట్టకేలకూ గత ఏడాది వేసవిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 2026లో జనాభా లెక్కలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఎస్సీ, ఎస్టీల లెక్కలతోపాటు బీసీల జనాభా పరంగా లెక్కలు తీస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో జనాభా లెక్క లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
2011 లెక్కల ప్రకారం ఇలా...
2011లో నిర్వహించిన లెక్కల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 7,95,332 మంది జనాభా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 4,91,319 మంది, పట్టణ ప్రాంతాల్లో 3,04,013 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీల జనాభా 1,54,855 మంది 19.47 శాతం, ఎస్టీల జనాభా 14,945 మంది 1.88 శాతం ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుషుల్లో 992 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 65.52 శాతం, ఏరియా 2,168 చదరపు కిలోమీటర్లు ఉంది. 1.94 లక్షల వరకు ఇళ్లు ఉన్నాయి.
ఫ ఏప్రిల్ నుంచి జనగణన..
జనాభా లెక్కలను ఏప్రిల్ నుంచి చేపట్టనున్నారు. మొదట ఇళ్లను లెక్కించిన తర్వాత జనాభా లెక్కించ నున్నారు. ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయులను నియ మించనున్నారు. వీరు ప్రతీ ఇంటిని సందర్శిస్తారు. ముందుగా ఇంటి స్వరూపం గురించి వివరాలు నమో దు చేసుకుంటారు. గుడిసె, పెంకులు, స్లాబ్ గదుల సంఖ్య, జీ ప్లస్ వన్, అంతకు పైగా ఉన్నటువంటి వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యుల సంఖ్యను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొన సాగనుంది. ఇళ్ల సంఖ్య, యజమానులు, కుటుంబ సభ్యుల సంఖ్య తేలిన తర్వాత జనాభాపై కొంత స్పష్టత వస్తుంది. దీంతో ప్రతి 700 నుంచి 800 మందికి ఒక్క ఎన్యూమరేటర్‌ను నియమిస్తారు. ఆరుగురు ఎన్యూమరే టర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమిస్తారు. వీరందరూ సొంత మొబైల్‌లోనే సీఎంఎంఎస్ (సెన్సెస్ మేనేజ్ మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) వెబ్ బోర్టర్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనగణనపై ఎన్యూ మరేటర్లకు శిక్షణ ఇవ్వడానికి కొందరు మాస్టర్ ట్రైనర్లను నియమించారు.
ఫ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా కలెక్టర్
జనగణనకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా అడిషనల్ కలెక్టర్ వ్యవహరిస్తారు. డివిజ న్లకు ఆర్డీవోలు, సీపీవో, డీఈవో, డీఏవో, జెడ్పీ సీఈవో, డీపీవో, ఏడీసీవోలు, తదితరులు ఉంటారు. అదేవిధంగా మండలాల్లో ఇన్చార్జి ఆఫీసర్లుగా తహసీల్దారు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా ఎంపీడీవోలు, ఎంఈవోలు ఉంటారు. మున్సిపాలిటీల్లో చార్జ్ ఆఫీసర్లుగా మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసరుగా మేనేజర్లు వ్యవహరిస్తారు. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ఈసారి జిల్లాలో 50 వేల వరకు జనాభా పెరిగే అవకా శాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన పదిహేనేళ్లలో కుటుంబ నియంత్రణను ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఒక్కరు లేదా ఇద్దరికి మించి పిల్లలను కనడం లేదు. కొందరైతే పెళ్లిల్లు చేసు కోకుండా ఒంటరి జీవితాన్ని అనుభస్తున్న కారణంగా జనాభా పెద్దగా పెరగక పోవచ్చు. పట్టణాల జనాభా ఎక్కువగా పెరిగనున్నది. చాలా మంది పిల్లల చదు వులు, ప్రభుత్వ. ప్రైవేట్ ఉద్యోగాల రీత్యా పట్టణాల్లో నివాసం ఉంటున్నందున్న పట్టణ జనాభా పెరగనున్నది.