ద్రోణి ఎఫెక్ట్.. దంచి కొడుతున్న వర్షాలు

ABN, Publish Date - Feb 24 , 2026 | 05:17 PM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న తరుణంలో.. సోమవారం నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఇప్పటికే పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు కురవడంతో పలుచోట్ల మొక్కజొన్న వంటి పంటలు నేలవాలాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం.. అన్నాడీఎంకే హామీల వర్షం

ఎయిర్ అంబులెన్స్ ఘటన.. వెలుగులోకి కన్నీళ్లు పెట్టించే విషయాలు..

పైలట్ అప్రమత్తత.. నిలిచిన ప్రయాణికుల ప్రాణాలు

Updated at - Feb 24 , 2026 | 05:18 PM