తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్ర నేతలు
ABN, Publish Date - Feb 24 , 2026 | 06:08 PM
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు లొంగియారు. దేవ్‌జీ, మల్లారాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి.. డీజీపీ ఎదుట సరెండర్ అయ్యారు.
1/13
మావోయిస్టు అగ్రనేతలు నలుగురు నేడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు.
2/13
దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి(పొలిట్ బ్యూరో కమిటీ మెంబెర్).. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్(సెంట్రమ్ కమిటీ మెంబెర్).. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్(తెలంగాణ స్టేట్ సెక్రటరీ).. నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సన్ను దాదా (స్టేట్ కమిటీ మెంబర్) పోలీసుల ముందు లొంగిపోయారు.
3/13
పోలీసులు ఈ నలుగురినీ మంగళవారం మీడియా ముందుకు తీసుకువచ్చారు.
4/13
40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో పనిచేసిన ఈ అగ్రనేతలు లొంగుబాటు నిర్ణయం తీసుకున్నారు.
5/13
మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయినట్లు పోలీసులు ప్రకటించారు.
6/13
ఈ నలుగురి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో అగ్రస్థాయి బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు కీలక నేతలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
7/13
మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన ఇంకా 11 మంది అజ్ఞాతంలో ఉన్నారని అన్నారు.
8/13
అనారోగ్య కారణాల రీత్యా తాను లొంగిపోయానని, రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితం గడపాలని భావిస్తున్నానని దేవ్‌జీ అన్నారు.
9/13
దశాబ్దాల కాలం నుంచి నేను నమ్మిన సిద్ధాంతాల ప్రకారమే ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
10/13
1982లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్‌లో చేరిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ దండకారణ్యంలో ఆయుధ దళ కార్యకలాపాలు నిర్వహించారు.
11/13
1970లలో ఉద్యమంలోకి వచ్చిన మల్లారాజి రెడ్డి..1980లలో డివిజనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారు. 1990లో సీసీఎంగా నియమితులయ్యారు.
12/13
నూనె నరసింహా రెడ్డి మావోయిస్టు దళాల్లో కీలక పదవుల్లో పని చేశారు.
13/13
1996లో ఆర్‌ఎస్‌యూ ద్వారా పార్టీలో చేరి 1999-2000లో ఏటూరునాగారం-మహాదేవపూర్ ప్రాంతాల్లో పార్టీ సభ్యుడిగా పనిచేశారు.
Updated at - Feb 24 , 2026 | 06:17 PM