క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం..

ABN, Publish Date - Feb 26 , 2026 | 07:26 PM

వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణతో పాటు శ్రీ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నూతన విగ్రహాల వాయు ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 1/14

వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణతో పాటు శ్రీ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నూతన విగ్రహాల వాయు ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 2/14

ఈ మహోత్సవాన్ని కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 3/14

భక్తుల నడుమ భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 4/14

ఈ మహోత్సవ కార్యక్రమంలో ABN ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు కోగంటి భాను ప్రకాష్, కోగంటి అనూష దంపతులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. వారు ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన హోమాధి పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 5/14

ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 6/14

ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్ల విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 7/14

వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు జలాధివాసం, శయనాధివాసం, ధాన్యాధివాసం వంటి పూజా కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 8/14

ఇందులో భాగంగా హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామినామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 9/14

ఈ కార్యక్రమాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 10/14

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నూతన విగ్రహాలకు వాయు ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 11/14

అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 12/14

మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాన్ని అందజేశారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 13/14

ఈ ఊరేగింపులో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హారతులు ఇస్తూ, మంగళవాయిద్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

క్రాపలో ఆధ్యాత్మిక శోభ.. నేత్రపర్వంగా ఆలయ పున:ప్రతిష్ఠాపన మహోత్సవం.. 14/14

గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated at - Feb 26 , 2026 | 07:47 PM