11వ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు

ABN, Publish Date - Feb 26 , 2026 | 11:32 AM

ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 26: ఏపీ శాసనమండలి సమావేశాలు 11వ రోజు మొదలయ్యాయి. సభ మొదలైన వెంటనే ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రశ్నోత్తరాలను చేపట్టగా.. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ సభ్యులు ప్రశ్నలేవనెత్తారు. ఈ పథకంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాయలసీమకు రావాల్సిన నీటి వాటా రావడం లేదని.. గత ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిందని వైసీపీ ఎమ్మెల్సీలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీలు అన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీకి మాట్లాడే హక్కుందా.. సిగ్గుండాలి’ అంటూ మంత్రి ఫైర్ అయ్యారు.

Updated at - Feb 26 , 2026 | 11:36 AM