కొబ్బరి నీళ్లు ప్రకృతి ప్రసాదించిన ఎనర్జీ డ్రింక్. ఇందులో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేషన్‌ను వెంటనే తగ్గిస్తాయి.  

కీర దోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

నారింజ, బత్తాయిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను ఇవి భర్తీ చేస్తాయి.

తాటి ముంజల్లో ఉండే పొటాషియం  శరీరంలోని వేడిని తగ్గించి, కడుపులో మంటను నివారిస్తుంది.

వేసవిలో రారాజు పుచ్చకాయ. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. లైకోపిన్ చర్మాన్ని ఎండ దెబ్బ నుంచి కాపాడుతుంది.

కర్భూజా పండులో ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.