పల్లీలు మంచివే కానీ.. ఎక్కువ తింటే ఈ సమస్యలు తప్పవు..
శనగ పలుకులను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే తరచుగా తినడం వల్ల కొన్ని సమస్యలు మొదలవుతాయి.
పల్లీలలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.
పల్లీలలో ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మోతాదుకు మించి తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.
పల్లీలను ఎక్కువగా తీసుకుంటే పలు అలెర్జీలు మొదలవుతాయి.
శనగ పలుకులకు ఉప్పు కలిపి వేయించి తినడం ప్రమాదకరం. శరీరంలో సోడియం లెవెల్స్ పెరిగిపోయి రక్తపోటు ముప్పు మొదలవుతుంది.
శనగ పలుకులలో కొన్నిసార్లు అఫ్లోటాక్సిన్స్ అనే ప్రమాదకర సమ్మేళనాలు కలిసి కాలేయ వ్యాధికి కారణమవుతాయి.
పల్లీలను అమితంగా తినడం వల్ల శరీరంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోయి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
పల్లీలలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లను ఏర్పరచవచ్చు.
పల్లీలలోని కొన్ని రకాల కొవ్వులు చర్మంపై దద్దుర్లు, ఆక్నేకు కారణం కావచ్చు.
Related Web Stories
పెరుగులోని నీటితో ఇంత ఆరోగ్యమా..?
రాత్రి భోజనం త్వరగా చేస్తే.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..
పీనట్ బటర్.. మీ బరువును, షుగర్‌ను తగ్గిస్తుంది..
రాగి జావతో మెంతులు కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..