స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Feb 21 , 2026 | 05:44 PM
పల్నాడు జిల్లా వినుకొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛరథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
1/6
పల్నాడు జిల్లా వినుకొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు.
2/6
వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛరథాలను ప్రారంభించారు.
3/6
ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు.
4/6
అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. రాబోయే రోజులన్నీ వినుకొండకు మంచి రోజులేనని అన్నారు.
5/6
మండలానికి ఒక స్వచ్ఛ రథం ఇచ్చామని.. ప్రతి వారం మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛ రథం తిరుగుతుందని చెప్పారు.
6/6
చెత్త ద్వారా మళ్లీ వస్తువులను ఉత్పత్తి చేస్తామని.. విశాఖలో చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంట్‌ను తయారు చేస్తామన్నారు.
Updated at - Feb 21 , 2026 | 07:47 PM