అకాల వర్షం.. అన్నదాతకు తీరని శోకం
ABN, Publish Date - Feb 25 , 2026 | 09:09 AM
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతలకు తీరని శోకాన్ని మిగుల్చాయి. తెలంగాణలోని నిర్మల్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలు నేలపాలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతలకు తీరని శోకాన్ని నింపాయి. తెలంగాణలోని నిర్మల్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలు నేలపాలయ్యాయి. వేల ఎకరాల్లో మొక్క జొన్న, శనగ, మిర్చి పంటలకు నష్టం జరిగింది. అలానే వరి, పెసర, మామిడి, బొప్పాయి పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. చేతికి అందివచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతన్న ఆవేదన చెందుతున్నాడు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, పంటల నష్టాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.
Updated at - Feb 25 , 2026 | 09:12 AM