గురుకులాలపై సర్కారు నజర్
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:56 AM
రాష్ట్రంలో గురుకులాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల ...
జిల్లాకు ఒక నోడల్ అధికారి నియామకం.. విద్యార్థుల భద్రత, సంక్షేమమే లక్ష్యం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గురుకులాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల జీవన ప్రమాణాలు, వసతులు, మానసిక, శారీరక ఆరోగ్యంపై క్షేత్రస్థాయి పర్యవేక్షణను పటిష్ఠం చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో నోడల్ అధికారుల నియామకం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ‘ఆకస్మిక తనిఖీలు’ నిర్వహించి గురుకులాల పనితీరును అంచనా వేయాల్సి ఉంటుంది. దీనివల్ల సిబ్బంది జవాబుదారీతనం పెరుగుతుందని సర్కారు భావిస్తోంది. ప్రతినెలా 5వ తేదిలోపు పురోగతి నివేదికలను ప్రభుత్వానికి అందజేయాలని తెలిపింది.