Share News

పంచాయతీలకు మరో రూ.387.53 కోట్లు

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:47 AM

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం బకాయిల కింద కేంద్ర ఆర్థిక శాఖ రూ.387.53కోట్లు శుక్రవారం విడుదల చేసింది.

పంచాయతీలకు మరో రూ.387.53 కోట్లు

  • 3 విడతల్లో రూ.1033కోట్లు విడుదల చేసిన కేంద్రం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం బకాయిల కింద కేంద్ర ఆర్థిక శాఖ రూ.387.53కోట్లు శుక్రవారం విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అయితే, రెండు నెలల కిందట ఎన్నికలు జరిగి, సర్పంచ్‌లు కొలువు దీరడంతో బకాయి నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇందుకు స్పందించిన కేంద్ర ఆర్థిక మూడు విడతలుగా బకాయి నిధులను విడుదల చేస్తామని పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి 5న రూ.259.36కోట్లు, 12న రూ.387కోట్లు, 20వ తేదీ శుక్రవారం రూ.387.53 కోట్లు కలిపి మొత్తం రూ.1033.89కోట్లు ఇప్పటివరకు విడుదల చేసింది. మిగిలిన బకాయి రూ.2000కోట్లు మొత్తాన్ని విడతల వారీగా మార్చి 31నాటికి చెల్లించే అవకాశముందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఇచ్చి మాట ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు విడుదలైన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, ముఖ్యంగా పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Feb 21 , 2026 | 03:47 AM