Share News

Miss World 2025: ఇందిరా మహిళా శక్తి బజార్‌కు సుందరీమణులు

ABN , Publish Date - May 22 , 2025 | 11:36 AM

Miss World 2025: ఇందిర మహిళా శక్తి బజార్‌‌లో మిస్‌ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా ప్రభుత్వ చేయూతతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న తీరును మిస్‌ వరల్డ్ పోటీదారులకు మంత్రి సీతక్క వివరించారు.

Miss World 2025: ఇందిరా మహిళా శక్తి బజార్‌కు సుందరీమణులు
Miss World 2025

హైదరాబాద్, మే 22: మిస్‌ వరల్డ్ (Miss World 2025) పోటీల కోసం వచ్చిన సుందరీమణులు భాగ్యనగరంలో సందడి చేస్తున్నారు. ఈరోజు (గురువారం) ఇందిర మహిళా శక్తి బజార్‌కు చేరుకున్న మిస్‌వరల్డ్ పోటీదారులు.. ఎస్‌హెచ్‌జీ దుకాణాలను సందర్శించారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా ప్రభుత్వ చేయూతతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న తీరును ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీదారులకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) వివరించారు. స్వయం ఉపాధి నుంచి సంపద సృష్టి వరకు సాగుతున్న తీరును మంత్రి వివరించారు.


ఏటా 20 వేల కోట్లకు పైగా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తూ, వడ్డీ లేని రుణాలు చెల్లిస్తూ, ఆర్టీసీ అద్దె బస్సులు, మహిళా సంఘాల చే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు సంఘటిత మహిళా శక్తిని చాటుతున్న వైనాన్ని మిస్ వరల్డ్ పోటీదారులకు మంత్రి సీతక్క చెప్పారు. అనంతరం సెర్ప్‌ విజయాలపై డాక్యుమెంటరీ వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియోను మిస్ వరల్డ్ పోటీదారులు తిలకించారు. వీడియో చూసి చప్పట్లతో సుందరీమణులు సంతోషం వ్యక్తం చేశారు. సెర్ప్ ఉద్దేశాలను, లక్ష్యాలను సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వివరించారు.

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్: పోలీసులు


కాగా.. నగరంలో 72వ మిస్‌వరల్డ్ పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. మొత్తం 108 దేశాల సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మే 10న పోటీలు ప్రారంభమైనప్పటికీ నిన్న(బుధవారం) నుంచి వివిధ దశల్లో పోటీలు నిర్వహించారు. ఇక పోటీలో పాల్గొన్న 108 దేశాల సుందరీమణుల్లో టాప్ - 24 జాబితాను మిస్‌ వరల్డ్ నిర్వాహకులు ప్రకటించారు. టాప్-24 జాబితాలో భారత్ తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా ఉన్నారు. అలాగే ఈనెల 23న జరిగే కీలక పోటీలో ఈ 24 మంది మిస్‌వరల్డ్ పోటీదారుల నుంచి టాప్-10ను ఎంపిక చేయనున్నారు. వీరంతా ఈనెల 31న హెచ్‌ఐసీసీలో జరిగే తుది పోటీల్లో పాల్గొంటారు.


ఇవి కూడా చదవండి

ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్

ముంబై వచ్చేసింది

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 22 , 2025 | 01:45 PM