Home » MLC Kavitha
ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఎవరిని ఉద్దేశిస్తూ కవిత ఈ ట్వీట్ చేశారన్నది తెలియాల్సి ఉంది.
నల్గొండ జిల్లాలో కవిత పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసి హోర్డింగ్‌లను మున్సిపల్ అధికారులు తొలగించారు. తనకు కోమటిరెడ్డికి ఎలాంటి పంచాయతీ లేదని.. కానీ హోర్డింగ్‌లను తొలగించారంటూ కవిత్ ఫైర్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? అని కవిత ప్రశ్నించారు. చనాక-కొరటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీల బంద్‌కు మద్దతు తెలుపుతూ.. ఆటోలతో ర్యాలీ చేశారు.
కేసీఆర్ ఫొటో లేకుండానే కవిత యాత్ర చేస్తామన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని.. అయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ‘నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా’ అని అన్నారు కవిత. జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
కవిత చేపట్టబోయే యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించికున్నట్లు సమాచారం.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని కవిత గుర్తు చేశారు. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరినా ఆమోదం పొందలేదని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేస్తుందని కవిత ఆరోపించారు. ప్రొఫెసర్ హరగోపాల్‌ని స్వయంగా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఈటల ఫైటర్ అయి ఉండి.. గౌరవం తగ్గించుకునే విధంగా మాట్లాడారని కవిత విమర్శించారు. ఉద్యమకారుడు, బీసీ బిడ్డ ఈటల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు దారుణమన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని కవిత చెప్పుకొచ్చారు. కార్మికులకు బిచ్చమేసేలాగా కాంగ్రెస్ లాభాల వాటాను ప్రకటించిందని దుయ్యబట్టారు.