Share News

kalvakuntla kavitha: రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..?

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:37 AM

తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? అని కవిత ప్రశ్నించారు. చనాక-కొరటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

kalvakuntla kavitha: రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..?
kalvakuntla kavitha

ఆదిలాబాద్: పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మొంథా తుఫాన్ వల్ల పంట దెబ్బ తిని నష్ట పోయారని చెప్పారు. అమ్మడానికి పోతే తేమ పేరుతో పత్తి రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) మీడియాతో మాట్లాడారు.. 20 శాతానికిపై తేమ ఉన్న పంటను కూడా పూర్తి మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


రాష్ట్రంలో సీసీఐ వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? అని కవిత ప్రశ్నించారు. చనాక-కొరటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు అంచనాలు పెంచారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక పనులను ఆపేశారని పేర్కొన్నారు. దీంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.


మరోవైపు.. సీసీఐ రోజుకో నిబంధన తీసుకురావడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల మోంథా తుపాన్‌ వరదలతో పత్తికి భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని 20 శాతం తేమ ఉన్నా సీసీఐ కొనుగోలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు నిలిపివేస్తామని తెలంగాణ జిన్నింగ్‌ మిల్లర్స్‌, ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక

Updated Date - Nov 04 , 2025 | 11:39 AM