AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక
ABN , Publish Date - Nov 04 , 2025 | 06:04 AM
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆప్కాబ్, డీసీసీబీలు, పీఏసీఎ్‌సలలో జరిగిన అవినీతి, అవకతవలపై ఈనెల 17వ తేదీలోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని...
అధికారులకు అసెంబ్లీ హౌస్ కమిటీ ఆదేశం
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆప్కాబ్, డీసీసీబీలు, పీఏసీఎ్‌సలలో జరిగిన అవినీతి, అవకతవలపై ఈనెల 17వ తేదీలోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను అసెంబ్లీ ప్రత్యేక హౌస్ కమిటీ ఆదేశించింది. సహకార సంస్థలపై దర్యాప్తు కోసం ఏర్పాటైన హౌస్ కమిటీ సమావేశాన్ని సోమవారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో కమిటీ చైర్మన్ ఎన్.అమర్నాథ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. 2019-2024 మధ్య ఆప్కాబ్, డీసీసీబీలు, పీఏసీఎ్‌సలలో జరిగిన అవినీతి, అవకతవలపై వాడీవేడి చర్చ జరిగింది. 17వ తేదీలోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సహకారశాఖ కమిషనర్ అహ్మద్‌బాబు, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్‌రెడ్డిలను హౌస్ కమిటీ ఆదేశించింది. కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, బూర్ల రామాంజనేయులు, యార్లగడ్డ వెంకట్రావు, తెనాలి శ్రావణ్‌కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు.