Kalvakuntla Kavitha: జిల్లాల యాత్రకు.. కవిత శ్రీకారం..
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:19 AM
కవిత చేపట్టబోయే యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించికున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. దీపావళి తర్వాత జిల్లాల యాత్రను కవిత ప్రారంభించనున్నట్లు సమాచారం. సామాజిక తెలంగాణే లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ కవిత యాత్ర చేయనున్నారు. ఇవాళ(బుధవారం) మధ్యహ్నాం 2 గంటలకు తన యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కవిత విడుదల చేయనున్నారు.
అయితే కవిత చేపట్టబోయే యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. యాత్రలో భాగంగా మేధావులు, విద్యావంతులను కవిత కలుసుకోనున్నారు. రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలనే అంశాలపై వారితో కవిత చర్చించనున్నారు.
ఈ మధ్య కాలంలో.. బీఆర్ఎస్ నేతలపై కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అలాగే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు.. అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత చేపట్టబోయే యాత్రపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. యాత్రలో ప్రజల మద్దతు పొందిన తరువాత కవిత తన సొంత పార్టీని ప్రకటించే.. యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Crop Procurement Begins: పంటల కొనుగోళ్లకు వేళాయె!
Polavaram Project: పోలవరం బనకచర్ల’ను పరిశీలించొద్దు