కేసీఆర్ ఫొటో అవుట్.. సీఎం రేవంత్‌కు కవిత కృతజ్ఞతలు

ABN, Publish Date - Oct 15 , 2025 | 01:36 PM

కేసీఆర్ ఫొటో లేకుండానే కవిత యాత్ర చేస్తామన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని.. అయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ‘నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా’ అని అన్నారు కవిత. జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

హైదరాబాద్: జాగృతి జనం బాట పేరుతో కల్వకుంట్ల కవిత తెలంగాణలోని జిల్లాల్లో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. నాలుగు నెలల పాటు యాత్ర ఉంటుందని.. ప్రతి జిల్లాల్లో రెండు రోజులు కవిత ఉంటామన్నారు. కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేస్తామన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని.. అయితే కేసీఆర్ ఫొటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ‘నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా’ అని అన్నారు కవిత. జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫొటో పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. జాగృతి పెట్టినప్పుడు జయశంకర్ ఫొటో పెట్టామన్నారు. కేసీఆర్‌కు పుట్టడం తన అదృష్టమని.. ‘మా దారులు వేరే అయినప్పుడు నా లైన్ నేను తీసుకోవడం కరెక్ట్’ అని అన్నారు. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని.. ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని తెలిపారు. నైతికంగా కరెక్ట్ కాదనే కేసీఆర్ ఫోటో తీసేస్తున్నట్లు కవిత వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్‌ కేసులో కౌంటర్‌ వేయండి

Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్‌

Updated at - Oct 15 , 2025 | 01:56 PM