Kalvakuntla Kavitha: రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతుల సమస్యలపై ఎమ్మెల్సీ కవిత పోరాటం
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:20 PM
ట్రిపుల్ ఆర్ రైతులకు అండగా ఉండి, సమస్యలు పరిష్కరించేందుకు జనవరి 4న 8 జిల్లాల నిర్వాసిత రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో చిన్న రిజర్వాయర్‌ను పెద్దదిగా మార్చి..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 24: రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టు నిర్వాసిత రైతుల సమస్యలపై ఎమ్మెల్సీ కవిత గట్టిగా స్పందించారు. రాయిగిరి, తిమ్మాపురం, బస్వాపూర్ వంటి ప్రాంతాల రైతులతో కలిసి మాట్లాడిన కవిత, ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో చిన్న రిజర్వాయర్‌ను పెద్దదిగా మార్చి రైతుల భూములు లాగేసుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం (భువనగిరి)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు స్పందించారు. పరిహారం రాలేదని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు.
'ట్రిపుల్ ఆర్ రైతులకు అండగా ఉండి, సమస్యలు పరిష్కరించేందుకు అందరం కలిసి ఉద్యమిద్దాం' అని కవిత పిలుపునిచ్చారు. జనవరి 4న 8 జిల్లాల నిర్వాసిత రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఆసుపత్రుల్లో వైద్య సేవలు, చికిత్స నాణ్యతపై కూడా అధికారులను ప్రశ్నించి కవిత సమాచారం సేకరించారు.

ఇవీ చదవండి:
ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రాజెక్టు.. ఇల్లు అప్పగించని పౌరుడు.. చివరకు..
వాయుకాలుష్యం నుంచి తక్షణ ఉపశమనం.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో