Kishan Reddy Vs KTR: కేటీఆర్‌పై కిషన్‌రెడ్డి సీరియస్
ABN , Publish Date - May 22 , 2025 | 01:14 PM
Kishan Reddy Vs KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ట్విట్టర్ మాజీ మంత్రి ఎక్కడ ఉన్నా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు వినాలన్నారు.
హైదరాబాద్, మే 22: దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు అమృత్ భారత్ స్టేషన్లను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. దేశంలో 1,300 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. 2026లో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరగబోతున్నాయని వెల్లడించారు.
బేగంపేట రైల్వేస్టేషన్లలో మహిళలే పనిచేయబోతున్నారన్నారు. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. రూ.80వేల కోట్ల పనులకు సంబంధించిన ప్లాన్లు జరగుతున్నాయన్నారు. దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారని.. ఇక యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్ ప్రారంభిస్తామన్నారు.
కాగా.. మాజీ మంత్రి కేటీఆర్‌పై (Former Minister KTR) కేంద్రమంత్రి సీరియస్ అయ్యారు. ట్విట్టర్ మాజీ మంత్రి ఎక్కడ ఉన్నా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు వినాలన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేస్తే మాజీ సీఎం కేసీఆర్ కనీసం రాలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విప్లవాత్మకమైన అభివృద్ధి పనులు చేసి చూపిస్తామన్నారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించుకున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే అప్రోచ్ రోడ్‌కు భూసేకరణ పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంత వేగంగా సహకరిస్తే అంతకంటే వేగంగా కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఇందిరా మహిళా శక్తి బజార్‌కు సుందరీమణులు
గుల్జార్ హౌస్ ప్రమాదానికి అసలు కారణం ఇదే
Read Latest Telangana News And Telugu News