Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో బాంబులంటూ ఫోన్లు.. పోలీసులు అలర్ట్
ABN, Publish Date - May 09 , 2025 | 06:25 PM
Bombs Threat: భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేసి కొంతమంది హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో బాంబులు పెట్టినట్లు ఫోన్లు చేసి కొంతమంది హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తాజాగా ఢిల్లీలోని ఓ స్టేడియం, హైదరాబాద్ విమానాశ్రయంలో బాంబులు పెట్టినట్లు కాల్స్ వచ్చాయి. ఢిల్లీ , డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA)కు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్ బృందాలు, ఢిల్లీ పోలీసు బృందాలు అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకున్నాయి.
అది బూటకమని తేలిందని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ తెలిపారు. తమకు డీడీసీఏ చిరునామాకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు ఫోన్ వచ్చిందని అన్నారు. ఆ మెయిల్‌ను వెంటనే ఢిల్లీ పోలీసులకు పంపించామని తెలిపారు. ఢిల్లీ పోలీసు బాంబు స్క్వాడ్ వచ్చి మొత్తం స్టేడియాన్ని తనిఖీ చేసిందని వివరించారు. బాంబులను ఏం గుర్తించలేదని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ తెలిపారు. ఈ విషయం తెలియడంతో వెంటనే స్క్వాడ్ బృందాలను స్టేడియానికి తరలించామని, ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. స్టేడియంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అన్నారు. ఇంకా, స్టేడియం లోపల, చుట్టుపక్కల భద్రతను పెంచామని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు...
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏ క్షణమైన బాంబుతో ఎయిర్‌పోర్టు పేల్చివేస్తామని హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వానికి. చెప్పాలని.. తాము విశ్వసనీయమైన పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ అంటూ ఆ ఫోన్‌లో పేర్కొన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు మేరకు రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇండిగో విమానాలు రద్దు..
కాగా.. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఇండిగో విమానాలు రద్దు చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సున్నితమైన ప్రాంతాలకు వెళ్లే చాలా విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, రాజ్‌కోట్‌లకు తిరిగి వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గగనతలంలో ఆంక్షలు, పెరిగిన భద్రతా సమస్యల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: ఢిల్లీ ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Operation Sindoor: మీ ఆవేదన తీర్చలేదని.. మురళీనాయక్ ఫ్యామిలికి సీఎం పరామర్శ
Supreme Court Orders: డిప్యూటీ కలెక్టర్‌కు డిమోషన్.. సుప్రీం సంచలన తీర్పు
Operation Sindoor: జవాన్ మురళీ నాయక్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు
For More AP News and Telugu New
Updated Date - May 09 , 2025 | 06:38 PM