Home » India Pakistan War
పాకిస్థాన్ అంటే అబద్ధాల పుట్ట అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకునే శత్రుదేశం.. మరోమారు తమ నిజస్వరూపం చూపించింది.
ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.
మళ్లీ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్థాన్. భారత్‌పై ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే శత్రుదేశం.. ఒక విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోకపోవడంతో ఇండియా సాయాన్ని అర్థిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి తాము వివరించామని అన్నారు.
కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లయి ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
సైనికులకు బాసటగా రాహుల్‌గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్‌పాయ్ కొనియాడిన విషయం కిషన్‌రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రానికి సహకరించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని తెలిపారు. నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా యుద్ధం ఎందుకు ఆపేశారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
సంతకాలు చేస్తారు తప్ప డెలివరీలు చేయరంటూ భారత వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. ఆయుధాల డెలివరీల విషయంలో ఇదేం పద్ధతి అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం సమయంలో భారత సైనికులు పంజాబ్, ఫిరోజాపూర్ జిల్లాలోని పలు గ్రామ పొలాల్లో క్యాంపులు వేశారు. శత్రు దేశానికి తగిన విధంగా సమాధానం చెబుతూ ఉన్నారు. శ్రవణ్ సింగ్ అనే 10 ఏళ్ల బాలుడు తమ పొలంలో ఉన్న జవాన్ల క్యాంపు దగ్గరకు వెళ్లాడు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అక్కడి ప్రజల మదిలో ఉన్న కోరిక ఏంటో ఆయన పంచుకున్నారు. మరి.. ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం..