Share News

Pakistan Loses 127 Crore: భారత్‌ను దెబ్బతీయాలనుకుని బొక్క బోర్లా పడ్డ పాక్..

ABN , Publish Date - Aug 10 , 2025 | 08:49 AM

Pakistan Loses 127 Crore: సరిహద్దుల దగ్గర గొడవల కారణంగా ఇండియన్ విమానాలు అటు వైపు తిరగకుండా గగనతలాన్ని పాక్ మూసేసింది. అప్పుడు ఏకంగా 54 మిలియన్ డాలర్ల లాస్ వచ్చింది. ఆర్థికంగా నష్టపోతున్నా కూడా గగనతలాన్ని పాక్ తెరవటం లేదు.

Pakistan Loses 127 Crore: భారత్‌ను దెబ్బతీయాలనుకుని బొక్క బోర్లా పడ్డ పాక్..
Pakistan Loses 127 Crore

పాకిస్తాన్ పరిస్థితి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు తయారైంది. భారత్‌ మీద కక్షతో.. ప్రతి చర్యలో భాగంగా చేసిన ఓ పని పాక్ కొంప ముంచింది. అసలే అంతంత ఆదాయంతో అల్లాడుతున్న దేశానికి 127 కోట్ల నష్టం వచ్చేలా చేసింది. అది కూడా కేవలం రెండు నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఇంతకీ సంగతేంటంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడానికి భారత్ సిందూ జలాలను ఆపేసింది. దీంతో పాకిస్తాన్‌కు కోపం వచ్చింది. ఇండియన్ విమానాలు అటు వైపు తిరగకుండా గగనతలాన్ని మూసేసింది.


పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారత్‌కు చెందిన 100 నుంచి 150 విమానాలపై ప్రభావం పడింది. అయితే, ఈ నిర్ణయం కారణంగా భారత్ కంటే పాక్ ఎక్కువ నష్టపోయింది. భారత్ విమానాలు అటువైపు వెళ్లకపోవటం వల్ల కేవలం రెండు నెలల్లోనే భారీ నష్టాన్ని చవిచూసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 వరకు 127 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఓ ప్రజా ప్రతినిధి స్వయంగా వెల్లడించాడు. 2019లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.


సరిహద్దుల దగ్గర గొడవల కారణంగా ఇండియన్ విమానాలు అటు వైపు తిరగకుండా గగనతలాన్ని పాక్ మూసేసింది. అప్పుడు ఏకంగా 54 మిలియన్ డాలర్ల లాస్ వచ్చింది. ఆర్థికంగా నష్టపోతున్నా కూడా గగనతలాన్ని పాక్ తెరవటం లేదు. ఈ నెల మొత్తం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నష్టం సంగతి పక్కన పెడితే.. పాకిస్తాన్ ఎయిర్ అథారిటీ ఆదాయం బాగా పెరిగింది. 2019లో ఆదాయం 508,000 డాలర్లు ఉండగా.. 2025 నాటికి అది 760,000 పెరిగింది.


ఇవి కూడా చదవండి

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఓటుకు ఏకంగా 10 వేల రూపాయలు

ఎల్లలు దాటి నోరూరిస్తున్నాయి...

Updated Date - Aug 10 , 2025 | 08:54 AM