Share News

Pulivendula ZPTC Polls: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఓటుకు ఏకంగా 10 వేల రూపాయలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 08:13 AM

Pulivendula ZPTC Polls: పులివెందులలో ఓటుకోసం ఎంత డబ్బైనా ఇచ్చేందుకు వైసీపీ సిద్దమైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యూహరచన చేస్తున్నారు. ఒక్కో ఓటు కోసం ఏకంగా 10 వేల రూపాయలు పైనే ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం.

Pulivendula ZPTC Polls: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఓటుకు ఏకంగా 10 వేల రూపాయలు
Pulivendula ZPTC Polls

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది. ఓటింగ్ దగ్గరపడుతుండటంతో వైసీపీలో ఓటమి భయం తారాస్థాయికి చేరింది. దానికి తోడు పులివెందుల ఉప ఎన్నిక మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ డబ్బును మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడానికి సిద్ధమైంది.


పులివెందులలో ఓటుకోసం ఎంత డబ్బైనా ఇచ్చేందుకు వైసీపీ సిద్దమైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యూహరచన చేస్తున్నారు. ఒక్కో ఓటు కోసం ఏకంగా 10 వేల రూపాయలు పైనే ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. ఎంత ఖర్చు చేసైనా సరే పులివెందుల స్థానాన్ని గెలవాలన్న కసిలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. ఇప్పుడు రెండు కాకపోయినా.. సొంతగడ్డ పులివెందులైనా గెలిచి తీరాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.


భయపెడుతున్న వివేకా కేసు..

వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత తండ్రి జయంతి సందర్భంగా పులివెందుల వచ్చారు. వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. తన తండ్రి చనిపోయిన రోజు కనీసం ఊరేగింపు కూడా జగన్ చేయలేదంటూ మండిపడ్డారు. పులివెందులలో హత్యా రాజకీయాలు మారాలని ఆమె అన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం సృష్టించాయి.


ఇవి కూడా చదవండి

అణా.. కాణీ.. కహానీ

ఏపీ అగ్రి ఎగుమతులకు దెబ్బ

Updated Date - Aug 10 , 2025 | 08:22 AM