AP Chamber of Commerce: ఏపీ అగ్రి ఎగుమతులకు దెబ్బ
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:02 AM
రష్యా నుంచి చమురు కొనుగోలుచేస్తున్నామన్న సాకుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన పరిణామం..
రకరకాల బియ్యం, వివిధ ఆహార పదార్థాలపై 50శాతం టారిఫ్
జాబితాలో దంపుడు బియ్యం,ఉప్పుడు బియ్యం, పాలిష్డ్ బియ్యం
ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం ప్రభుత్వాలు సహకరించాలి
ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి
అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రష్యా నుంచి చమురు కొనుగోలుచేస్తున్నామన్న సాకుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన పరిణామం.. ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ట్రం నుంచి ఇప్పుడిప్పుడే అమెరికాకు పలు వ్యవసాయ, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. వీటిలో దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం, పాలిష్డ్ బియ్యం, పిండి, జీడిపప్పు, బెల్లం పొడి, టమోటా సాస్, మినరల్ వాటర్, రోస్టెడ్ నట్స్, తృణ ధాన్యాల ఉత్పత్తులు మొదలైనవి ఉన్నాయి. వీటివల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతోంది.