Air chief marshal AP Singh: పాకిస్తాన్ జెట్లను కూల్చేశాము.. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ ప్రకటన..
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:30 PM
Air chief marshal AP Singh: పాకిస్తాన్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఐదు జెట్లను మాత్రమే కాకుండా.. ఓ భారీ ‘ఎయిర్‌బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్’ను కూడా కూల్చేశామన్నారు.
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్‌పై శనివారం కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశామని తెలిపారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో ఐదు పాకిస్తాన్ జెట్లను పేల్చిపడేశాము. ఐదు జెట్లను మాత్రమే కాకుండా.. ఓ భారీ ‘ఎయిర్‌బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్’ను కూడా కూల్చేశాము.
రెండు వైమానిక స్థావరాలు ధ్వంసం చేశాం. మే 9, 10 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. మే 9వ తేదీ రాత్రి ఎక్కువగా పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. డ్రోన్, ఎస్ 400 గగనతల రక్షణ వ్యవస్థ బాగా పనిచేసింది. వారి యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాం. వాటిని ఎంతో సమర్థవంతంగా కూల్చిపడేశాం. ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌కు స్పష్టమైన సందేశమిచ్చాం’ అని ఆయన అన్నారు.
కాగా, ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అమాయక పర్యాటకులను కాల్చి చంపారు. 26 మందిని బలి తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. దీంతో 100 మంది ఉగ్రవాదులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకోవటంతో పాక్ తట్టుకోలేకపోయింది. యుద్ధానికి దిగింది. యుద్ధంలో భారీ ఎత్తున నష్టపోయింది. చివరకు తోకముడిచింది.
ఇవి కూడా చదవండి
భారత్‌ను దెబ్బకొట్టాలనుకుంది.. రూ.400 కోట్లు కోల్పోయింది.. పాకిస్థాన్ పరిస్థితి ఏంటంటే..
నేను నోటీసులు ఇచ్చుకుంటూ పోతే.. కేసీఆర్, కేటీఆర్ జీవితాంతం జైల్లోనే..