Pakistan: భారత్‌ను దెబ్బకొట్టాలనుకుంది.. రూ.400 కోట్లు కోల్పోయింది.. పాకిస్థాన్ పరిస్థితి ఏంటంటే..
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:09 PM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన అపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌కు వెన్నులో వణుకు తెప్పించింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఎన్నో నిర్ణయాలు తీసుకుని వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పాకిస్థాన్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది.
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఎన్నో నిర్ణయాలు తీసుకుని వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పాకిస్థాన్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. భారత్ విమానాలకు గగనతలాన్ని (Pakistan Airspace) మూసేయడం ఆ వ్యతిరేక నిర్ణయాల్లో ఒకటి. అయితే పాకిస్థాన్ తీసుకున్న ఆ నిర్ణయం ఆ దేశానికి తీవ్ర నష్టం కలుగజేసింది. ఈ నిర్ణయం కారణంగా పాకిస్థాన్ రెండు నెలల్లోనే దాదాపు రూ.400 కోట్లు కోల్పోయింది.
భారత్ నుంచి వచ్చే విమానాలను ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాకిస్థాన్ తన గగనతలంలోకి అనుమతించడం లేదు. ఈ నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది. నిజానికి భారత్ నుంచి వెళ్లే అంతర్జాతీయ విమానాలు చాలా వరకు పాకిస్థాన్ గగనతలాన్ని వాడుకుంటాయి. పాక్ గగనతలం మీదుగా రోజుకు 100 నుంచి 150 భారతీయ విమానాలు ప్రయాణిస్తుంటాయి. ఇలా గగనతలాన్ని వాడుకున్నందుకు ఓవర్ ఫ్లైయింగ్ ఛార్జీలను (overflying charges) చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బోయింగ్ విమానం పాక్ గగనతలం మీదుగా ప్రయాణిస్తే దాదాపు 580 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
పాకిస్థాన్ గగనతలం మూసేయడంతో భారత్ విమానాలు వేరే మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. దీంతో ఆ ఓవర్ ఫ్లైయింగ్ ఛార్జీలను పాకిస్థాన్ కోల్పోయింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 మధ్యలో పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి (Pakistan Airports Authority) రూ.410 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ అక్కడి అసెంబ్లీలో వెల్లడించినట్లు డాన్ నివేదించింది. ఈ ఆంక్షల వల్ల పాకిస్థాన్ ఏడాదికి వేల కోట్ల రూపాయలను కోల్పోతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి