Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఎయిర్‌పోర్టుల మూసివేత
ABN, Publish Date - May 08 , 2025 | 01:02 PM
Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనివల్ల భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్ వల్ల కొన్ని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 20 విమానాశ్రయాలు మే 10వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో ఉత్తర, పశ్చిమ భారత ప్రాంతంలో గగనతలం మూసివేశారు. దీంతో మే 10వ తేదీ, శనివారం వరకు దాదాపు 20 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది.
తాత్కాలికంగా నిలిపివేత...
ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివిధ విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. ప్రయాణికులు తమ విమాన ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారతదేశం దాడులు చేసిన తర్వాత, దాదాపు అన్ని విదేశీ విమానయాన సంస్థలు బుధవారం ఉదయం నుంచి పాకిస్తాన్ ఆకాశమార్గం మీదుగా విమానాలను నిలిపివేశాయి. రెండు దేశాల మధ్య దాడులు జరుగుతుండటంతో కొన్ని విమానయన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.
మూసివేసిన విమానాశ్రయాల జాబితా ఇదే..
లేహ్
శ్రీనగర్
జమ్మూ
అమృత్‌సర్
పఠాన్‌కోట్
చండీగఢ్
జోధ్పూర్జైసల్మేర్
జామ్నగర్భటిండా
భుజ్
ధర్మశాల
సిమ్లా
రాజ్‌కోట్
పోర్‌బందర్
బికనెర్
హిండన్
కిషన్‌గఢ్
కాండ్లా
గ్వాలియర్
ఆ విమానాలను ఢిల్లీకి మళ్లించాం: ఎయిర్ ఇండియా
అమృత్‌సర్‌కు వెళ్లాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఫలితంగా భారతీయ విమానయాన సంస్థలు ఇప్పుడు పశ్చిమ భారతదేశం, ఉత్తర ప్రాంతాలతో పాటు ముంబై మధ్య విమాన సమయాలను పొడిగించాయి. డచ్ ఎయిర్‌లైన్స్ KLM తన ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ఢిల్లీ విమానానికి గంట ఎక్కువ సమయం పడుతుందని, ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ముంబై విమానాన్ని ఒక గంట 15 నిమిషాలు పొడిగించినట్లు పేర్కొంది. ఈ రెండు మార్గాలు నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉంటాయని ఎయిర్ ఇండియా సంస్థలు తెలిపాయి. విమానయాన సంస్థ ఆదేశాలకు అనుగుణంగా, జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు వెళ్లే విమానాలను మే 10వ తేదీన ఉదయం 5.29 గంటల వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించింది. ప్రయాణికులు రీషెడ్యూల్ చేసుకోవాలని, లేదా నగదును వాపస్ తీసుకోవ్చని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఎయిర్ ఇండియాను సంప్రదించవచ్చని సూచించింది.
ప్రయాణికులు ఆన్‌లైన్‌లో పరిశీలించాలి: ఇండిగో
భారత ప్రభుత్వం విధించిన గగనతల పరిమితుల కారణంగా అమృత్‌సర్, బికనీర్, చండీగఢ్, ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, లేహ్, రాజ్‌కోట్ , శ్రీనగర్ సహా విమానాశ్రయాల నుంచి 165కు పైగా విమానాలు 2025 మే 10వ తేదీన ఉదయం 5.29 గంటల వరకు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం ప్రయాణికులు ఆన్‌లైన్‌లో పరిశీలించాలని సూచించింది. బుకింగ్‌లకు ఉచిత రీషెడ్యూలింగ్ లేదా పూర్తిగా లేక వాపస్ చేసుకోవాలని ఇండిగో ప్రయాణికులకు సూచించింది.
ప్రయాణాన్ని రీ షెడ్యూలింగ్ చేసుకోవాలి: స్పైస్‌జెట్
మే 10వ తేదీన ఉదయం 5.30 గంటల వరకు అమృత్‌సర్, గ్వాలియర్, జమ్మూ, శ్రీనగర్, హిండన్‌లకు వెళ్లే ప్రయాణికులు నగదు తిరిగి తీసుకోవడం లేదా ప్రయాణాన్ని రీ షెడ్యూలింగ్ చేసుకోవచ్చని స్పైస్‌జెట్ తెలిపింది. మారుతున్న పరిస్థితుల కారణంగా, ఉత్తర భారతదేశంలోని ధర్మశాల, లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్ వంటి చాలా విమానాశ్రయాలు తదుపరి ప్రకటన వచ్చేవరకు మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇందువల్ల విమానాల రాకపోకలపై ప్రభావం పడే అవకాశం ఉందని స్పైస్‌జెట్ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్.. సిద్ధమైన క్షిపణులు..
Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి
Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Read Latest International News And Telugu News
Updated Date - May 08 , 2025 | 02:48 PM