Share News

Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి

ABN , Publish Date - May 08 , 2025 | 10:23 AM

Pak Cross Border Firing: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతినుంచి పాకిస్తానీ ఆర్మీ రెచ్చిపోతూనే ఉంది. వరుసగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. 14వ రోజు కూడా సరిహద్దుల వెంబడి కాల్పులకు పాల్పడింది.

Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Pak Cross Border Firing

పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా కాల్పులకు తెగబడుతూనే ఉంది. వరుసగా 14వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు కొనసాగాయి. జమ్మూకాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, యూరీ, అఖ్‌నూర్ ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో మొత్తం 13 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్న పిల్లలు, ఒక సైనికుడు కూడా ఉన్నాడు. అయితే గత 13 రోజులుగా జరిగిన కాల్పుల కంటే.. 14వ రోజు జరిగిన కాల్పుల తీవ్రత అధికంగా ఉంది.


భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ ఆర్మీ మరింత రెచ్చిపోయింది. మొన్నటి వరకు చిన్న చిన్న గన్నులతో దాడులకు పాల్పడేది. నిన్న రాత్రి చిన్న గన్నులతోపాటు పెద్ద పెద్ద తుపాకులతో కూడా కాల్పులకు తెగబడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతినుంచి పాక్ ఆర్మీ రెచ్చిపోతూనే ఉంది. భారత ఆర్మీ ఏమీ చేయకపోయినా.. పాక్ ఆర్మీ మాత్రం వరుసగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 40 మంది దాకా చనిపోయారు.


25 నిమిషాల్లో 70 మంది ఖతం

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మంగళవారం అర్థరాత్రి 1.05 నిమిషాలకు ప్రారంభం అయింది. మొత్తం 25 నిమిషాల్లో ఆపరేషన్ ముగిసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 70 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయారు. మరో 60 మంది దాకా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్‌గా ఈ దాడులు జరగలేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. తాము రెచ్చ గొట్టే చర్యలకు పాల్పడలేదని తెలిపింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. వైరల్‌గా మాజీ ఆర్మీ చీఫ్ పోస్ట్

Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ స్పందన

Updated Date - May 08 , 2025 | 10:28 AM