Telangana Govt Alert on Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు
ABN, Publish Date - Aug 27 , 2025 | 04:07 PM
లంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. కామారెడ్డి జిల్లా బికనూరు తాళమండ్ల సెక్షన్‌లో భారీ వరద ప్రవాహంతో ట్రాక్ కింద నీరు నిలవడంతో వివిధ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది.
కామారెడ్డి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) ప్రభుత్వం (Telangana Govt) అప్రమత్తమైంది. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు సంబంధిత అన్ని విభాగాల అధికారులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క) (Minister Seethakka) అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సీతక్క కీలక సూచనలు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గ్రామం, పట్టణంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలను అనుమతించవద్దని, ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. రక్షణ చర్యల్లో ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోరాదని, ప్రతి ఒక్క అధికారి తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని సూచించారు. అలాగే, వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తక్షణ సహాయక చర్యలు కొనసాగుతాయని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
రైళ్ల రాకపోకలకు అంతరాయం..
మరోవైపు.. తెలంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. కామారెడ్డి జిల్లా బికనూరు తాళమండ్ల సెక్షన్‌లో భారీ వరద ప్రవాహంతో ట్రాక్ కింద నీరు నిలవడంతో వివిధ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది. అక్కన్నపేట - మెదక్ సెక్షన్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది. ముంబై టూ లింగంపల్లి, లింగంపల్లి టూ ముంబై, ఓఖా టూ రామేశ్వరం, భగత్ కి కోఠి టూ కాచిగూడ మధ్య రైల్వే సర్వీసులను డైవర్షన్ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, కాజీపేట, సికింద్రాబాద్ జంక్షన్ మీదుగా మళ్లించారు. ఈరోజు వెళ్లాల్సిన నిజామాబాద్ టూ తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. కాచిగూడ టూ మెదక్ ట్రైన్‌ను రైల్వే అధికారులు పాక్షికంగా రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
Read Latest Telangana News and National News
Updated Date - Aug 27 , 2025 | 05:19 PM