Share News

Traffic Police Offer: వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు

ABN , Publish Date - Aug 22 , 2025 | 01:19 PM

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు అతి క్రమించిన వాహనదారులకు గతంలో విధించిన చలానాల్లో చెల్లించే రుసుంను భారీగా తగ్గించినట్లు వెల్లడించారు.

Traffic Police Offer: వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు
Traffic Police

బెంగళూరు, ఆగస్టు 22: వాహనదారులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు అతి క్రమించిన వాహనదారులకు గతంలో విధించిన చలానాల్లో చెల్లించే రుసుంను భారీగా తగ్గించినట్లు వెల్లడించారు. చెల్లించాల్సిన రుసంలో సగం.. అంటే 50 శాతం నగదు చెల్లిస్తే సరిపోతుందని వాహనాదారులకు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ గడువు ఆగస్ట్ 23వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఈ చలానాలు చెల్లించ వచ్చని వివరించారు. నగరంలోని వాహనదారులకు జరిమాన భారం నుంచి ఉపశమనం కలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అంతేకాదు.. ఈ చెల్లింపులను క్రమబద్దీకరించు కోవడంతోపాటు చట్టపరమైన సహాయాన్ని నివారించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.


ఈ నగదును వివిధ మార్గాల్లో చెల్లించ వచ్చని వాహనదారులకు ఈ సందర్భంగా సూచించారు. ఆన్‌లైన్ పేమెంట్‌ను బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల (బీపీటీ) వెబ్‌సైట్, కర్ణాటక స్టేట్ పోలీస్‌ (Karnataka State Police)తోపాటు బీటీపీ అస్త్రం (BTP ASTraM) మొబైల్ యాప్ ద్వారా జరిమాన నగదు చెల్లించ వచ్చని వాహనదారులకు వివరించారు.


అలాగే స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లో ఈ జరిమాన పడిన వ్యక్తి స్వయంగా వెళ్లి నగదు చెల్లించకోవచ్చన్నారు. అంతేకాకుండా.. కర్ణాటకవన్, బెంగళూరువన్ సేవా కేంద్రాల్లో సైతం ఈ నగదు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అయితే కారు రిజిస్ట్రేషన్ నెంబర్లకు లింక్ చేయబడిన ఏమైనా బకాయిలు ఉన్నాయో.. చలాన్లలను తనిఖీ చేసుకోవాలని వాహనాదారులకు వారు స్పష్టం చేశారు. ఇక చెల్లింపులు ఈ చలాన్లకు మాత్రమే వర్తిస్తుందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు

పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

For More National News And Telugu News

Updated Date - Aug 22 , 2025 | 02:02 PM