Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
ABN, Publish Date - Nov 14 , 2025 | 06:46 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికీ వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు.
హైదరాబాద్,నవంబరు14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election) కౌంటింగ్ ఇవాళ(శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. 10 రౌండ్స్‌లో 42 టేబుల్స్‌గా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఒక్కో టేబుల్‌కు ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. 186 మంది కౌంటింగ్ సిబ్బంది ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు.
మొదటగా పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం లోపే తేలనుంది ఫలితం. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఓట్లు 4,01,365 ఉన్నాయి. నవంబరు11వ తేదీన జరిగిన పోలింగ్‌లో 48.49 శాతం పోలింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం 1,94,621 ఓట్లు పోలయ్యాయి. గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎవరికీ వారు ధీమాగా ఉన్నారు. ముందుగా షేక్‌పేట డివిజన్ ఓట్లని లెక్కించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. ఈ ఉప ఎన్నికపై బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ రిజర్వేషన్లు భిక్ష కాదు.. మా హక్కు
సోయా, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సడలింపులివ్వండి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 14 , 2025 | 06:58 AM