బిహార్ లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. రామ్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో బీఎస్‌పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్‌ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. భాజపా తరఫున అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె.. సుమారు 12వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొడుతోంది. అదే సమయంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకి ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతోంది. నితీష్ కుమార్, ఎల్‌జేపీ ముందు ఆర్జేడీ పూర్తి స్థాయిలో డీలాపడింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. వారి మోసాన్ని యూపీలో సాగనివ్వమంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.
ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాను ప్రజల చెవుల్లో పడలేదని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని చెప్పుకొచ్చారు.
బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి, ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం దిశగా పయనిస్తోంది.
బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.
బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తాను గెలిస్తేనే ముఖానికి ధరించిన మాస్క్ ను తొలగిస్తాను అని శపథం చేసిన ఓ మహిళ.. ఓటమి అంచుల్లో ఉంది.
బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్ కు ఊహించని షాకిస్తున్నాయి. ఆ కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు.